మాతృదేవోభవ


రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
\\రాలిపోయే//

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
\\రాలిపోయే//

అనుభంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమె తనతొ రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలె ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
\\రాలిపోయే//

Saturday, August 28, 2010 at 9:10 AM , 0 Comments


మళ్లీ పుట్టనీ
ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మిణుకు మిణుకు మంటోంది

మనిషిగ బతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై

కళ్ళల్లో జీవమై
ప్రాణమై ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

at 9:02 AM , 0 Comments


ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా

భారమంతా నేను మోస్తా అల్లుకోవాశాలతా
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలోనే పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగజన్మకలా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా

ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా

పరిగెడదాం పదవె చెలీ..ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ..ఎక్కడున్నా
ఎగిరెళదాం ఇలనొదిలీ..నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్నీ...ఎవరాపినా
మరోసారి అను ఆ మాటా మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా

ఆ తరుణమూ కొత్త వరమూ చెంగుముడి వేసిందిలా
చిలిపితనమూ చెలిమి గుణమూ ఏవిటీ లీల
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మది కెదురై కనబడలేదా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా

పిలిచినదా చిలిపి కలా
వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా
పరుగు తీశా
వదిలినదా బిడియమిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కు వలా
ఎటో చూశా

భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా
త్వరగా విడిరా సరదా పడదామా

పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినా నా ప్రియతమా
చిక్కునుంటే బిక్కుమంటూ లెక్క చేస్తాగా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా

మమతనుకో మగతనుకో మతి చెడి పోదా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా

at 9:00 AM , 0 Comments


ఉప్పెనంత ఈ ప్రేమకీ..గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ..ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో

ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని ఫిక్షన్లెందుకో

I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా
I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ..గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

కనులలోకొస్తావు..కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు..మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ..పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరి !

I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా
I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ..గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా

నిన్ను కోరి పూలు తాకితే..నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఆ చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !

I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా
I Love You..నా ఊపిరి ఆగిపోయినా
I Love You..నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ..గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

at 8:50 AM


కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమా !

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

పరుగులు తీస్తూ..అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికీ చేరువ కాను
నిదురను దాటీ నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయ్యిందా..ఓ ఓ ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా..ఓ ఓ ఓ
నేడీ బంధానికి పేరుందా..ఓ ఓ ఓ
ఉంటే విడదీసే వీలుందా..ఓ ఓ ఓ

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వులతోనే
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటని చూస్తుంటే..ఓ ఓ ఓ
నా బాధంతటి అందంగా ఉందే..ఓ ఓ ఓ
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే..ఓ ఓ ఓ
మరుజన్మే క్షణమైనా చాలంతే..ఓ ఓ ఓ

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమా

at 8:50 AM , 0 Comments

నచ్చావులే


మన్నించవా మాటాడవా
కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా
కరునించవా కనిపించవా
I am so sorry baby oo oo oo...
i am really sorry baby oo oo oo...
ఓ చెలీ పొరపటుకీ
గుణపాటమే ఇదా ఇదా
మౌనమే ఉరితాడులా
విసిరెయ్యకే ఇలా ఇలా
మన్నించవా మాటడవా
కరుణించవా కనిపించవా
మన్నించవా మాటడవా
కరుణించవా కనిపించవా

నావల్ల జరిగింది తప్పు
నేనేమి చెయ్యలో చెప్పు
పగపట్టి పామల్లే నువ్వు బుసకొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి
కారాలు మిరియాలు నూరి
ఎవేవో సాపాలు గట్ర పెట్టేయ్యకే
కళ్ళావేళ్ళా పడ్డకూడ ఊరుకోవా
కుయ్యోమొర్రో అంటు ఉన్న అలక మానవా
అందం చందం అన్ని ఉన్న సత్యబామ
ఫంతం పట్టి వేధించకే నువ్వు ఇలా
ఓ..హో..చెలీ చిరునవ్వులే కురిపించవా ఓ.హో.ఓ.హో
రాదని విదిలించకే బెదిరించకే ఇలా ఓ.హో.ఓ.హో
మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా

అరగుండు చేయించుకుంటా బ్లేడెత్తి కోసేసుకుంటా
కోరడతో కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజిళ్ళు తీస్తా ఒంగోంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయే కొడతా దయ చూపవే
గుండెల్లోన అంతొ ఇంతొ జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించవా
Friendship అంటే అడపా దడపా గొడవే రాదా
Sorry అన్న సాధిస్తవే నీడలా
ఓ..హో చెలీ ఎడబటునే కలిగించకే ఇలా ఇలా
నన్నిలా ఏకాకిలా వదిలేళ్ళకే అలా ఆ

మన్నించవా మాటడవా కరునించవా కనిపించవా

at 8:46 AM , 0 Comments

Premikularoju


వాలు కనులదాన
వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే

వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే

చెలియా నిన్నే తలచీ
కనులా జధిలో తడిచీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే...
నిను నేను చేరుకోనా ....

వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని జరుగు
రసవీణ నీ మేను మీటాలి నామేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్ర మిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
నీ సొగసు కేదిసాటి
వాలు కనులదాన

at 4:03 AM , 0 Comments