అమ్మ తల్లె నోర్దూయవే నోటిముత్యాల్ జార్నీయకే

ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు
దాటాక దాటాక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కర కొట్టుడు
మీటక మీటక మనస్సును మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గిరజరిగి, దెగ్గరజరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలుపెరిగే, ఓహ్ ఓహ్ ఓ
ప్రేమలు పిండగ నవ్వుల పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే

అమ్మ తల్లె నోర్దూయవే నోటిముత్యాల్ జార్నీయకే
అమ్మ తల్లె నోర్ముయవే నోటిముత్యాల్ జార్నీయకే

ఆ మబ్బున గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి, పొంగేనంట వర్షం
మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది, అందేనంట హర్షం
ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం

ఓ లేత కొమ్మను తాకిన వెంటనే
లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం
నా కొమ్మను తాకిన వెంటనే పూ రెమ్మల తేనలు పట్టి
రగిలే రిషా ఉషోదయం
నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం
గిచ్చిన చోట యవ్వన గంధం
నీకు నాకు జీవన బంధాలే

హే అమ్మ తల్లే నాన్చేయకే నవరత్నాల్ రాల్చేయవే

నువ్వెక్కడవుంటే నేనక్కడ పక్కన ఉంట
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరిబిక్కిరి చేస్తుంట
నా చూపుకు జాబిలి వంట నా రేఖలు పావనమంట
నువ్వే నేనంటా

అమ్మ తల్లే అల్లాడకే

ఓహ్ రేపని మాపని మాపటి రేపని
కాదనది లేదని లేదని కాదని
వేదనలోన మోదన సాధన చాలించమంట

నీ వాకిలి వేకువనవుత
నీ చీకటి చాకిరినవుత
నాకై కేకలు పెడితే కాకిలా
నయగారాల చిలక చినక చిలక చినక చిలక
నువ్వు నా నింగిని కోరిన వేళ వేల గంగలుగా
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించే... ఎలా ఎలా ఎలా ఎలా

జాబిలి గుమ్మ ..జాబిలి గుమ్మ.. జాబిలి గుమ్మ ...జాబిలి గుమ్మ..జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ
జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ….జాబిలి గుమ్మ...

కొట్టినవాడే దగ్గిరజరిగే, దగ్గిరజరిగే సిగ్గులు కరిగే
సిగ్గులుకరిగే ప్రేమలుపెరిగే ఓహ్ ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే

అమ్మ తల్లే నోర్ముయవే
నోటిముత్యాల్ జార్నీయకే ..నోటిముత్యాల్ జార్నీయకే
నోటిముత్యాల్ జార్నీయకే...నోటిముత్యాల్ జార్నీయకే

Friday, September 10, 2010 at 3:02 AM