భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్

భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2)
పడ్డాను పిలగాడా మోజుపడ్డాను మొనగాడా
జోడైతే జోరేగా ఎల్ ఓ ఈ లవ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదననోయ్ (2)

తెలిసేది కాదు ప్రేమా తెలియంది కాదు సుమా
దొరికేది కాదులేమ్మా తెరచాటు ఘాటు చుమ్మా
ప్రియమైనా ఈ వసంతం వయసల్లే ఎంత సొంతం
పరువాల కోయిలమ్మా పలికింది ప్రేమా గీతం
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2)

మనసమ్మ కూని రాగం వయసమ్మ వాయు వేగం
కౌగిళ్ళ ఆశలోనా కోరింది అర్ధభాగం
విరహాల వింత దాహం విడదియ్యలేని స్నేహం
తెలిసిందో ఏమో పాపం కురిసింది నీలి మేఘం
పడ్డాను పిలగాడా మోజుపడ్డాను మొనగాడా
జోడైతే జోరేగా ఎల్ ఓ ఈ లవ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2)

Friday, September 10, 2010 at 3:02 AM

0 Comments to "భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్"

Post a Comment

wow